Complaint College vallu and college management chesina mosam ..

  • TV9 Customer Care Contact Number, Office Address, Complaint Email Id - College vallu and college management chesina mosam ..
    Kancharla Venkata Naganjineyulu on 2022-04-08 13:49:52

    నా పేరు కంచర్ల వెంకట నాగాంజనేయులు మాది వినుకొండ మండలం పెద్దకంచర్ల గ్రామం నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని విజయవాడ లోని ఆంధ్ర లొయోల కాలేజీ లో చదువుకుందాం అని వెళ్లి అక్కడ బి.కం కంప్యూటర్స్ కోర్స్ కోసం అప్లికేషన్ పెట్టాను.కానీ కాలేజీ యాజమాన్యం నేను పెట్టిన అప్లికేషన్ ని రద్దు చేసి బి.ఒకేషనల్ పారామెడికల్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనే కోర్స్ కి అప్లికేషన్ పెట్టించి మీకు ఈ కోర్స్ చేయటం వాళ్ళ మంచి జీవితం ఉంటుంది అని బలవంతంగా జాయిన్ చేపించారు .మాకు తరువాత మా సీనియర్స్ ద్వారా ఆయా కోర్స్ కి రిజిస్ట్రేషన్ లేదు అనే విషయం తెలిసింది.మేము అందరం కలిసి అడగటం వలన హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ జి.ఎం.శ్రీరంగం సర్ మీరు ఎవ్వరు చెప్పిన మాటలు నమ్మకండి మీ ౩ర్డ్ ఇయర్ ఐపోయే లోపల మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది అని చెప్పారు. మేము గెట్టిగా అడిగినప్పుడు మీకు సర్టిఫికెట్స్ ఎలా వస్తాయో చూస్తాం అని బెదిరింపులు చేసారు .నిజం చెప్పాలి అంతే అలాంటి ఒక గ్రూప్ ఉంది అని అక్కడ ఉండే పక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియదు . తరువాత మా తల్లిదండ్రులు మాట్లాడదాం అని వచ్చినప్పుడు వాళ్ళని గంటలు గంటలు వెయిట్ చేపించి తరువాత లోపాలకి పిలిచి కనీసం మాట్లాడకుండా వెళ్లిపొమ్మని అంటున్నారు .అక్కడ ఉండే ప్రిన్సిపాల్ వెళ్లి మీ ఫాకల్టీ ని హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ ని అడగండి అంటున్నారు మా ఫాకల్టీ ని అడిగితేయ్ మాకు తెలియదు వెళ్లి ఆఫీస్ లో అడగండి అని అంటున్నారు .హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ ని అడిగితే మీ సీనియర్స్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు మీకు ఏది యూనివర్సిటీ సర్టిఫికెట్ దీని విలువ మీకు తెలియదు అని మాట్లాడుతున్నారు కానీ మేము ఆ విలువైన సర్టిఫికెట్స్ ని తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తే జాబ్ కోసం అసలు ఇది ఉపయోగం ఉండదు ఈ సర్టిఫికెట్ కి పనికి రాదు అని చెప్తున్నారు మా సినీర్స్ ని అడిగితేయ్ ఎవ్వరు చెప్పారు మీకు అసలు అది ఉపయోగం ఉండదు దేనికి పనికి రాదు అని అంటున్నారు. యూనివర్సిటీ వాళ్ళని అడిగితేయ్ మీ కాలేజీ అటానమస్ మాకు సమందం ఉండదు అని అంటున్నారు .కాలేజీ యాజమాన్యం అసలు పట్టించుకోవట్లేదు మేము మూడు సంవత్సరాలు చదివి దేనికి ఉపయోగం లేకుండాపొంది. నాకూ న్యాయం జరిగేలా చేస్తారు అని నమ్మకంతో నేను మీడియా ముందుకు వచ్చాను.