Complaint OC corporation లోన్ గురించి..

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - OC corporation లోన్ గురించి..
    Rayi.Nagendra on 2018-10-04 13:45:46

    గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి..ఒక సామాన్యుడు తెలుపుకునే విన్నపం..
    అయ్యా!!
    నా పేరు రాయి.నాగేంద్ర
    పిఠాపురం,తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్..
    నేను మీ యొక్క భరోసా మరియు హామీ ఇచ్చిన ప్రకారం
    OC corporation లోన్ పెట్టుకుని యున్నాను..అలాగే దానికి సంబంధించిన అన్ని షరతులను పూర్తి చేసుకుని పట్టణ శాసనశభ్యుల నుండి కూడా అనుమతి పొంది యున్నాను..నేను సుమారు రెండు సంవత్సరముల క్రితం ఈ లోన్ పెడితిని..ఇప్పుడు అన్ని ఫార్మాట్స్ పూర్తి చేసుకుని పిఠాపురం DCC Bank లో నా యొక్క లోన్ ఎకౌంట్ ఓపెన్ చేసాను..
    లోన్ ఎకౌంట్ ఓపెన్ చేసి సుమారు నాలుగు నెలలు పూర్తయ్యింది..ఇంకనూ నాకు మెసేజ్ రాలేదు..బాంకు చుట్టూ మరియూ మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోతిని..అసలే నేను గ్రాడ్యుఏషన్ పూర్తిచేసిన నిరుద్యోగిని..పోనీ నిరుద్యోగ వృతి పెట్టుకుందామంటే..మీకు లోన్ ఉంది కదా మీకు రాదు అన్నారు..దీని వల్ల మరియూ పని మానుకుని తిరగడం వల్ల ఇంకనూ నేను ఆర్థికంగా నష్టపోయితిని...కావున మీరే ఈ సమస్యకు మార్గం చూపగలరు..మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను..మా నాన్న గారు కాలం చేసి పది సంవత్సరాలు అయ్యింది..మా కుటుంబానికి నేనే ఆధారం..మీరు దయతచి నన్ను ఆదుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాను..
    ఇట్లు
    మీ విధేయుడు
    రాయి.నాగేంద్ర