Complaint About hope of fee

  • Sri Chaitanya Techno School Customer Care, Complaints and Reviews - About hope of fee
    Ch.Srinath on 2022-07-06 16:10:05

    గౌ:చైర్మన్/బాధ్యులు/
    Surya Narayana - AGM - Sri Chaitanya Educational Institutions
    శ్రీ చైతన్య స్కూల్స్,ఆంధ్ర ప్రదేశ్.

    విషయము:- పెంచిన ఫీజు కట్టలేక పోయినందుకు,శ్రీ చైతన్య స్కూల్ చెంచుపేట బ్రాంచ్లో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని Admission No. SCS1068440 స్కూలు నుండి విద్యా హక్కుకు దూరమైన విషయం గా,

    అయ్యా/అమ్మ,

    నా పేరు CH.శ్రీనాథ్,వృత్తి న్యాయవాది,నా కూతురు గత సంవత్సరం శ్రీ చైతన్య స్కూల్,చెంచు పేట శాఖలో పూర్తి ఫీజు 36,000,ఒకే విడతలో చెల్లిస్తే 25000 అని ప్రిన్సిపాల్ చెప్పడంతో ఒకే విడతలో చెల్లించి 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది, నా ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో గత రెండు సంవత్సరాల నుండి చదువుకుంటున్నారు, ఇప్పటి వరకూ ఎటువంటి ఫ్రీజ్ డ్యూ లేదు,

    ఎనిమిదవ తరగతి క్లాసులకు హాజరు అయినది,
    ఈరోజు Dt.6-7-22 ఎనిమిదవ తరగతి ఫీజు చెల్లించడానికి మేము బ్రాంచ్ ను సందర్శించినప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ "ఈ సంవత్సరం పెంచిన ఫీజు 38,000 చెల్లించిన వారు మాత్రమే కొనసాగుతారు" ఒకే విడతలో కట్టినా సరే ఫీజు లో గతంలో లాగా తగ్గింపు ఉండదు అని తెలియజేసి ఉన్నారు,అంతట తాము చట్టవిరుద్ధంగా భారీగాపెంచిన ఫీజు కట్టలేమని,గతంలో కట్టిన ఫీజు కంటే రెండు,మూడు వేలు మాత్రమే అదనంగా చెల్లించ గలమనీ తెలియజేసి యున్నాము, ప్రిన్సిపాల్ మౌఖికంగా చెప్పిన విషయాన్ని పేపర్ మీద రాసి ఇవ్వమని తాము కోరగా అందుకు ఆమె తమ స్కూల్ రూల్స్ ప్రకారం అలా ఇవ్వకూడదు అని, పెంచబడిన ఫీజు కట్టగల స్తోమత లేనివారు విద్యార్థిని ఈ స్కూల్లో కొనసాగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోవడానికి స్వతంత్రులు అని చెప్పడంతో, చేసేది లేక మా కుమార్తె ను క్లాసు నుండి ఇంటికి తీసుకు వెళ్ళవలసి వచ్చింది,

    ఆ విధంగా విద్య హక్కు కు ఆమె దూరం కాబడింది,
    కావున ఈ విషయంపై యాజమాన్యం గా 24 గంటలలో తగిన నిర్ణయం తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తూ,పిల్లల భవిష్యత్తును వ్యాపారంగా చూడకుండా,నా కుమార్తె విద్యా హక్కులను,రాజ్యాంగ హక్కులను కాపాడవలసిందిగా కోరుచున్నాము

    ఇట్లు

    Ch. Srinath,(parent of the above student) Cell No. 9550851409

    CC To:
    1) DEO Guntur
    2) Principal Sri Chaitanya School chenchupetta, Tenali branch